కాటమయ్య రక్ష
తాడి చెట్టును ఆధారంగా చేసుకొని జీవనం చేస్తున్న కల్లుగీత కార్మికులు ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్నవారు. ఒక చెట్టును ఆధారం చేసుకొని జీవిస్తూ దానిని మానవ వనరుగా మార్చిన గొప్ప శాస్త్రవేత్తలు. మనిషికి పకృతికి మధ్య ఉండే సజీవమైన అనుబంధమే వీరి జీవన విధానం. చిన్న చిన్న పరికరాలతో ఎంత ఎత్తు చెట్టునైనా తమ వంశం చేసుకోగలిగిన సామర్ధ్యం వీరి సొంతం. తాడి చెట్టు ఎక్కడానికి సట్టు, మోకు, తాళ్ళ కొడవలి, చిరత పెడి, కల్లు గీసే కత్తి, తాడు, బుంగ వీరి సాధనాలు... అయితే కల్లుగీత కార్మికులు అన్ని కాలలలో చెట్టు ఎక్కడం కష్టమైన పని, ప్రమాదాలు జరిగే అవకాశం ఎకువ. వర్షా కాలంలో మోకు తడవడంతో జారి ప్రమాదాలు తరచుగా జరుగుతంటాయి. అందుకే గౌడన్నల జీవితానికి కాటమయ్య రక్ష గా ఉండాలని భావించాము. చెట్టు ఎక్కే ప్రతి గౌడన్న జీవితానికి ఒక్క సురక్షితమైన రక్షణ కవచంగా ఉండాలనేదే మా సంకల్పం. అందుకే వారికి తోడుగా రక్షణగా ఉండడానికి ఈ కాటమయ్య రక్షను అందిస్తున్నాం... గౌడ అన్నల జీవిత భద్రత కోసం ఆధునిక పరికరాలను పరిచయం చేస్తున్నాము. చెట్టు ఎక్కే ప్రక్రియలో వారి పరికరాలకు సమపాళ్ళగా విలీనం అయ్యే విధంగా మా సేఫ్టీ కిట్ రూపొందించబడింది. వారు వాడే పరికరాలకు అధనంగా కొన్ని పరికరాలను జత చేస్తున్నాము. అవి పెద్ద మార్పులుగా ఉండవు కాబట్టి సర్దుబాటు ప్రక్రియను వేగంగా అడాప్ట్ చేసుకునే వీలు ఉంటుంది. మా సేఫ్టీ కిట్ తో వృత్తిలో నైపుణ్యం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సేఫ్టీ కిట్ కల్లు గీత కార్మికుల సంప్రదాయ పద్ధతులను మార్చకుండా, వారిని రక్షించడానికి, శక్తివంతం చేయడానికి, సురక్షితంగా, సమర్థవంతంగా ఆత్మవిశ్వాసంతో చెట్టు ఎక్కడానికి ఈ కిట్ ఉపయోగపడుతుంది. 25KN శక్తి ఉన్న మా సేఫ్టీ కిట్ సామర్థ్యాన్ని ఐఐటీ, హైదరాబాద్ వారు పరీక్షించి ధృవీకరించారు. కల్ల గీత పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చేందుకు రూపొందించబడిందే మా సేఫ్టీ కిట్. దీర్ఘకాలిక భద్రత హామీతో, కల్లు గీత వృత్తి సురక్షితమైన వృత్తిగా మారుతుంది. మెరుగైన భద్రతా చర్యలతో పాటు బీమా సంస్థలు కవరేజ్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి. ఆధునిక భద్రతా పరికరాలతో కల్లు గీత కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పిద్దాం...